SBI: SBI బ్యాంక్‌లో రూ.2.88 కోట్ల కుంభకోణం.. కుమ్మక్కై డబ్బులు కాజేసిన ఇద్దరు మేనేజర్లు

2.88 Crore Scam in SBI Bank Ramanthapur Branch
x

SBI: SBI బ్యాంక్‌లో రూ.2.88 కోట్ల కుంభకోణం.. కుమ్మక్కై డబ్బులు కాజేసిన ఇద్దరు మేనేజర్లు  

Highlights

SBI: రామాంతపూర్‌, సీసీజీ బ్రాంచ్‌ల్లో వెలుగుచూసిన కుంభకోణం

SBI: హైదరాబాద్‌ రామాంతపూర్‌లో బ్యాంక్ మేనేజర్ల కుంభకోణం వెలుగుచూసింది. ఇద్దరు స్టేట్ బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కై వినియోగదారులకు చెందిన 2 కోట్ల 88 లక్షల రుణాలను కాజేశారు. కొత్తగా వచ్చిన మేనేజర్‌ను కస్టమర్లు లోన్ల గురించి ఆరా తీయగా ఇద్దరు మేనేజర్ల భాగోతం బయటపడింది.

రామంతాపూర్ లోని SBI బ్రాంచిలో పనిచేస్తున్న గంగ మల్లయ్య, సీసీజీ బ్రాంచ్‌లో మేనేజర్‌‌గా చేసిన షేక్ సైదులు వినియోగదారులు అప్లై చేసుకున్న రుణాలతో కుంభకోణానికి పాల్పడ్డారు. 19మంది వినియోగదారులు లోన్ల కోసం అప్లై చేయగా.. వారికి రుణం రాదని తెలిపారు. ఆ తర్వాత వారి పేర్ల మీదే తప్పుడు అకౌంట్ స్టేట్‌మెంట్లు సృష్టించారు. ఫారం-16ను ఫోర్జరీ చేసి ఆ డబ్బులను షేక్ సైదులు భార్య సుష్మ, పీరయ్యలకు బదిలీ చేశారు. ఇలా మొత్తం 2 కోట్ల 88 లక్షల రూపాయలు కాజేశారు.

రామాంతపూర్‌ బ్రాంచ్‌లో గంగ మల్లయ్య అనంతరం వీర వసంతరాయుడు మేనేజర్‌గా చేరారు. అయితే గతంలో రుణాల కోసం అప్లై చేసుకున్న వినియోగదారులు వచ్చి మేనేజర్‌ను ఆరా తీయగా.. స్టేటస్‌ చూస్తే చెల్లింపులు పెండింగ్‌లో పడినట్టు కనిపించింది. బ్యాంక్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డబ్బులు దారి మళ్లించినట్టు గుర్తించారు. తమ బాగోతం బయటపడటంతో షేక్ సైదులు ఫ్యామిలీ, గంగ మల్లయ్య పరారయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories