తెలంగాణలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు
x
Highlights

తెలంగాణలో కొత్తగా 42వేలకు పైగా కరోనా టెస్టులు చేయగా 253పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,993కి చేరింది....

తెలంగాణలో కొత్తగా 42వేలకు పైగా కరోనా టెస్టులు చేయగా 253పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,554కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 317 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,81,400కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,039 ఉండగా వీరిలో 2,793 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 70,61,049కి చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories