TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 2493 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 1 Jun 2021 10:15 PM IST
2493 New Coronavirus Cases Reported in Tealngana on 1 June 2021
X

తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 94,189 నమూనాలను పరీక్షించారు. ఇందులో 2వేల493 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 80వేల 834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 15 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల296 కి పెరిగింది. ఈ రోజు 3వేల308 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, నేడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 318 మందికి పాజిటివ్‌గా తేలింది.

Venkata Chari

Venkata Chari

Next Story