Balakrishna: బసవతారకం ఆస్పత్రి 23వ వార్షికోత్సవం.. తన తల్లి కోరిక మేరకు ఆస్పత్రి ఏర్పాటు చేశామన్న బాలకృష్ణ

Balakrishna: ఆస్పత్రి ఏర్పాటులో చంద్రబాబు సహకారం ఎంతో ఉందన్న బాలకృష్ణ

Shekhar G
Published on: 22 Jun 2023 2:44 PM IST
23rd Anniversary Of Basavatarakam Hospital
X

Balakrishna: బసవతారకం ఆస్పత్రి 23వ వార్షికోత్సవం.. తన తల్లి కోరిక మేరకు ఆస్పత్రి ఏర్పాటు చేశామన్న బాలకృష్ణ 

Balakrishna: క్యాన్సర్ పై పెద్దగా అవగాహన లేని సమయంలో తన తల్లి బసవతారకం కోరికమేరకు క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేశామని నందమూరి బాలకృష్ణ అన్నారు. 2000 సంవత్సరంలో నాలుగు కోట్ల రూపాయల ఫండ్ తో ఆస్పత్రి ప్రారంభించినట్టు తెలిపారు. ఔట్‌లుక్ మ్యాగజైన్ 2వ బెస్ట్ క్యాన్సర్ ఆస్పత్రిగా బసవతారకం ఆస్పత్రిని గుర్తించిందని బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆస్ప్రతి ఏర్పాటులో చంద్రబాబు సహకారం ఎంతో ఉందన్నారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడేనని ఆయన అన్నారు.

బసవతారకం ఆస్పత్రి 23వ వార్షికోత్సవం సందర్బంగా బ్యాడ్మెంటెన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీనటి శ్రీలీలతోపాటు పలువురు ప్రముఖుల్ని బాలకృష్ణ సన్మానించారు. ఈ సందర్భంగా పీవీ సింధూ, శ్రీలీలలు మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు సేవలందిస్తున్న ఆస్పత్రి సిబ్బందికి, బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story