Vasalamarri: కేసీఆర్ కోసం నోరూరించే వంటకాలు.. 23 రకాల వెరైటీలతో మెనూ!

Vasalamarri: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 12:25 PM IST
Vasalamarri: కేసీఆర్ కోసం నోరూరించే వంటకాలు.. 23 రకాల వెరైటీలతో మెనూ!
X

(ఫైల్ ఇమేజ్ )

Vasalamarri: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఇవాళ వాసాలమర్రి వెళ్లనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో సీఎం హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ మొదట గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. ఇక మటన్, చికెన్, పప్పు, పచ్చిపులుసుతో సహా 23 రకాల వంటకాలు వాసాలమర్రి సహపంక్తి భోజనాల కోసం సిద్ధమవుతున్నాయి. మటన్, చికెన్, చేపలు, బోటీ, తలకాయ కూర, గుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, పప్పు, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, పచ్చిపులుసు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వంటలు వండిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story