TS Corona Cases: తెలంగాణ‌కి ఊర‌ట‌.. త‌గ్గిన కరోనా కేసులు..

TS Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం.

Samba Siva Rao
Published on: 23 May 2021 9:23 PM IST
Corona Virus Positive Cases Telagana
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం


TS Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ అమ‌లు త‌ర్వాత నుంచి కొవిడ్ కేసుల సంఖ్య గ‌ణ‌ణీయంగా త‌గ్గ‌డం మొద‌లు పెట్టాయి. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్‌గా తేలాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 343 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా మరో 19 మంది మహమ్మారి బ‌లితీసుకుంది. మొత్తం మృతుల సంఖ్య 3125కి పెరిగింది.

దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,53,277కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌క‌ట‌న‌ విడుదల చేసింది. ఆదివారం 4,693 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు పేర్కొంది.





Samba Siva Rao

Samba Siva Rao

Next Story