తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 30 Sept 2020 9:53 AM IST
తెలంగాణలో కొత్తగా 2,103 కరోనా పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,103 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1127కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,243 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,91,386కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,60,933కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,326 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,880 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 55,359 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 29,96,001కి టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story