Coronavirus: తెలంగాణలో కొత్తగా 2,055 కరోనా కేసులు

Coronavirus: రాష్ట్రంలో 3,18,704కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు * ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 1,741 మంది మృతి

Sandeep Eggoju
Updated on: 8 April 2021 1:42 PM IST
2,055 new Corona Cases Registered In Telangana-08-04-2021
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 2వేల 55 కరోనా కేసులు నమోదుకాగా వైరస్‌ బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3లక్షల 18వేల 704కి చేరింది. అలాగే మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17వందల 41 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3లక్షల 3వేల 601గా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో 13వేల 362 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story