గచ్చిబౌలిలో మరో కారు బీభత్సం.. ఇద్దరు మృతి..

Gachibowli: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం ఘటన మరువకముందుకే గచ్చిబౌలిలో మరో కారు బీభత్సం సృష్టించింది.

Arun Chilukuri
Published on: 18 March 2022 7:49 PM IST
2 killed in Hyderabad Gachibowli Road Accident
X

గచ్చిబౌలిలో మరో కారు బీభత్సం.. ఇద్దరు మృతి..

Gachibowli: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదం ఘటన మరువకముందుకే గచ్చిబౌలిలో మరో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ఓ మహిళను ఢీకొట్టి, పల్టీలు కొట్టింది కారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణించిన యువతీ, యువకుడు కూకట్‌పల్లికి చెందిన రోహిత్‌, గాయత్రిగా గుర్తించారు. మద్యం మత్తులో కారును నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story