హైదరాబాద్‎లో రోడ్డు ప్రమాదం... మహిళ, చిన్నారి మృతి

హైదరాబాద్‎లో రోడ్డు ప్రమాదం... మహిళ, చిన్నారి మృతి
x
Highlights

నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున కారు బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

హైదరాబాద్ సిటీ పరిధిలో ర్యాష్ డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. అల్వాల్ నుండి సుచిత్ర ప్రదాన రహదారిపై కారు బైక్ ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అల్వాల్ లోని బీహెచ్ఈఎల్ ఎంక్లేవ్ కు చెందిన ప్రియదర్శిని ఆమె మేనల్లుడు అయాన్ ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదానికి కారకులైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories