Hyderabad: అబుదాబి మాడ్యూల్ పేలుళ్ల నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష

2 Hyderabadi Youths Get 5-Years Jail For Working For ISIS
x

Hyderabad: అబుదాబి మాడ్యూల్ పేలుళ్ల నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష

Highlights

Hyderabad: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరినీ దోషులుగా తేల్చిన NIA ఢిల్లీ కోర్టు

Hyderabad: అబుదాబి మాడ్యుల్ ద్వారా పేలుళ్లకు కుట్రపన్నిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని NIA ఢిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది. ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటు ఇద్దరికి 2 వేల చొప్పున జరిమానా విధించింది ఎన్‌ఐఏ కోర్టు. 2018లో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు. 2107లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వ్యూ చూసి అబ్దుల్ ఖాదిర్ ఆకర్షితుడయ్యాడు. మరో ఉగ్రవాదితో కలిసి టెర్రర్ ఫండింగ్ చేపట్టారు.

అధ్నాన్ హుస్సేన్ నుంచి బాసిత్ నిధులు సమకూర్చినట్లు అధికారులు గుర్తించారు. నిధుల ద్వారా యువకులకు వీసా పాస్‌పోర్టులు బాసిత్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఐసిస్ భావాజాలాన్ని అబ‌్దుల్ ఖాదిర్ ప్రమోట్ చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అబ్దుల్ బాసిత్ నిర్వహించిన ఐసిస్ కార్యక్రమాలను అబ్దుల్ ఖాదిర్ హాజరైనట్లు 2019లో సప్లి్మెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు ఎన్‌ఐఏ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories