తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 24 Jan 2021 11:15 AM IST
తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు
X

తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు


తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 197 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. మృతుల సంఖ్య 1,589కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 376 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,88,275కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,389 ఉండగా వీరిలో 1842 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story