TS Corona Cases: తెలంగాణలో కొత్తగా 1,933 కరోనా కేసులు, 16 మంది మృతి

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు 1933 కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 7 Jun 2021 9:46 PM IST
1933 New Coronavirus Cases Reported in Tealngana on 07 June 2021
X
కరోనా వైరస్‌ (ఫొటో ట్విట్టర్)

TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,32,996 నమూనాలను పరీక్షించారు. ఇందులో 1వేయి933 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5లక్షల 93వేల 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా రాష్ట్రంలో 16 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం మరణాల సంఖ్య 3వేల394 కి పెరిగింది. ఈ రోజు 3వేల527 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.



Venkata Chari

Venkata Chari

Next Story