తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు

X
Highlights
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి ...
Arun Chilukuri8 Oct 2020 4:28 AM GMT
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,896 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1201కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,067 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,06,644కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 21,724 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో 50,367 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 33,96,839 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Web Title1,896 new Coronavirus cases reported in Telangana
Next Story