ఉన్నఫలంగా కోట్లకు కోట్లు జమ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్న HDFC బ్యాంకు ఖాతాదారులు

18.52 Crores Of Rupees Deposited In HDFC Bank Account
x

HDFC Bank: ఉన్నఫలంగా కోట్లకు కోట్లు జమ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్న ఖాతాదారులు

Highlights

HDFC బ్యాంకులో గందరగోళం.. దేశంలోని పలువురి బ్యాంక‌‌‌‌ు ఖాతాల్లో కోట్ల రూపాయలు

HDFC Bank: ఉన్నఫలంగా కోట్లకు కోట్లు జమ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్న ఖాతాదారులు.. ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరుగుతోంది. HDFC బ్యాంకు ఖాతాదారులకే ఎందుకీ బంపరాఫర్. అసలీ HDFC కి ఏమైంది..?

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. తన అకౌంట్‌లో కోటికిపైగా నగదు జమ కావడంతో షాక్‌కు గురయ్యాడు. రేవోజిపేట్‌ గ్రామానికి చెందిన వంగల సాయి ఖాతాలో కోటి 20లక్షల రూపాయలు జమ అయ్యాయి.

ఒకటి కాదు రెండు కాదు ఒక్క సారిగా 18.52cr కోట్ల యాభై రెండు లక్షలు ఎకౌంట్లో క్రెడిట్ అయ్యాయ్. వికారాబాద్‌కు చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఖాతాలో ఒక్కసారిగా అంత మొత్తం క్రెడిట్ కావడంతో అవాక్కయ్యాడు. వికారాబాద్ పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతున్నాడు వెంకట్ రెడ్డి. అంత పెద్ద మొత్తంలో నగదు అకౌంట్లో పడటంతో ఆశ్చర్యానికి, షాక్ కు గురయ్యాడు. వికారాబాద్ HDFC బ్రాంచ్ నుంచి పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయల మొత్తం వెంకట్ రెడ్డి అకౌంట్లో జమయ్యింది. వెంటనే సమాచారాన్ని బ్యాంకు అధికారులకు వివరించానన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories