TS Corona Cases: తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు..తొలిసారి 2 వేల దిగువ‌కు

Samba Siva Rao
Updated on: 30 May 2021 9:43 PM IST
Corona cases in Telangana
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రెండో ద‌శ అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్నివారాలతో పోల్చితే తొలిసారిగా 2 వేల లోపున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు నిర్థార‌ణ అయ్యాయి. ఇంకా 35,042 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,263కి చేరింది. రికవరీ రేటు 93.34 శాతానికి పెరిగింది.

అదే సమయంలో 3,660 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,75,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,37,522 మంది కరోనా నుంచి బయటపడ్డారు.కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 4 కేసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో 4, ఆదిలాబాద్ జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి.

క‌రోనా కేసులు


Samba Siva Rao

Samba Siva Rao

Next Story