తెలంగాణలో ఆ 184 మంది ఎక్కడ?

తెలంగాణలో ఆ 184 మంది ఎక్కడ?
x
Highlights

కరోనా న్యూ స్ట్రెయిన్ పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంలో...

కరోనా న్యూ స్ట్రెయిన్ పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానంలో వేగం పెంచింది. యూకే నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలోకి 12 వందల 16 మంది వచ్చినట్లు తెలిపిన అధికారులు వారిలో 937 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్ నిర్థారణ అయినట్లు స్పష్టం చేశారు. అయితే యూకే నుంచి ఇప్పటి వరకూ వచ్చినవారిలో 184 మంది వివరాలు తెలియాల్సి ఉందని షాకిచ్చారు.

మరోవైపు యూకే నుంచి తెలంగాణకు వచ్చినవారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని అధికారులు తెలిపారు. మరో 184 మందికి సంబంధించిన వివరాలు సమగ్రంగా లేవన్నారు. వారి అడ్రస్‎లు, ఫోన్ నెంబర్ లు సరిగా లేవని వారిని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. దాంతో ప్రస్తుతం ఆ 184 మంది ఎక్కడున్నారు ఎవరెవరిని కాంటాక్ట్ అవుతున్నారన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్ భయం వెంటాడుతున్న వేళ ఏకంగా 184 మంది ఆచూకీ లేకపోవడం వైద్యారోగ్యశాఖను కూడా కలవరపెడుతోంది.

ఇక న్నిన్నటి వరకు 16 మంది యూకే రిటర్న్స్‎కు పాజిటివ్ నిర్థారణ కాగా ఇవాళ మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలోకి వచ్చిన 18 మందికి పాజిటివ్ నిర్థారణ అయిందని, ప్రస్తుతం 18 మందిని వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచామన్నారు. అలాగే ఈ 18 మందికీ సన్నిహితంగా ఉన్న మరో 79 మందిని గుర్తిచామన్న వైద్య ఆరోగ్య శాఖ వారిని క్వారెంటైన్ లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు. ఇక పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‎ను జినోమ్ సీక్వెన్స్ కోసం సీసీఎంబీకి పంపించామన్న అధికారులు మరో రెండు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories