Top
logo

తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1,718 కరోనా పాజిటివ్ కేసులు
X
Highlights

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి ...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,718 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1153కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,002 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,97,327కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,67,846కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 28,328 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 49,084 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 31,04,542 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Web Title1,718 new coronavirus cases reported in Telangana
Next Story