తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు

Sumitra
Published on: 13 Oct 2020 10:42 AM IST
తెలంగాణలో కొత్తగా 1,708 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కేసుల సంఖ్య మళ్లీ ఈ రోజు కూడా పెరిగాయి. తాజాగా నమోదయిన కేసులు 17వందలు దాటాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం టెస్ట్ ల సంఖ్య పెంచడంతో కేసుల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజే 1,708 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,14,792 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజు కరోనా బారిన పడి 5 గురు మృతిచెండంతో మరణాల సంఖ్య ఇప్పటి వరకు 1233కు చేరింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ యాక్టివ్ కేసులు 24,208గా ఉన్నాయి. కాగా వారిలో 19,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక నిన్న ఒక్క రోజే 2,009 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,89,351 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక రికవరీ రేటు విషయానికొస్తే తెలంగాణాలో రికవరీ రేటు 88.15% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 46,835 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 36,24,096 పరీక్షలు చేసారు.

Sumitra

Sumitra

Next Story