హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్

16 people Arrested in Terrorist riots in Hyderabad once again
x

హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. 16 మందిని అరెస్ట్

Highlights

Hyderabad: భోపాల్‌కు చెందిన 11 మంది,..హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో భారీ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 16 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో భోపాల్‌కు చెందినవారు 11 మంది ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు ఐదుగురు ఉన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో భోపాల్, హైదరాబాద్‌లో ఆపరేషన్ చేసి నిందితులను పట్టుకున్నారు.

నిందితులను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌కు పోలీసులు తరలిస్తున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైస్‌, డ్రాగన్‌లు స్వాధీనం చేసుకున్నారు. యువతను ఉగ్రవాదం వైపు టెర్రరిస్టులు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 18 నెలల నుంచి హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories