తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 5 Nov 2020 11:52 AM IST
తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,539 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,45,862కి చేరింది. తాజాగా 978 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,25,664 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,362కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,656 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. 15,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,327 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 44,84,183కి చేరింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story