తెలంగాణలో కొత్తగా 1,486 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 20 Oct 2020 9:43 AM IST
తెలంగాణలో కొత్తగా 1,486 కరోనా కేసులు
X

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,486 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,891 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,02,577కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,282కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 38,98,829కి చేరింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story