తెలంగాణలో కొత్తగా 1,451 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 17 Oct 2020 9:14 AM IST
తెలంగాణలో కొత్తగా 1,451 కరోనా కేసులు
X

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,451 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,20,675కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 9మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,265కి చేరింది. రాష్ట్రంలో 22,774 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 18,905 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కరోనా బారి నుంచి నిన్న 1983 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,96,636కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story