TS Corona Cases: కొత్తగా 1,436 కరోనా కేసులు..ఆ జిల్లాలో నో పాజిటివ్

TS Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

Samba Siva Rao
Published on: 6 Jun 2021 8:12 PM IST
Corona Virus Positive Cases Telangana
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

TS Corona Cases: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గడచిన 24 గంటల్లో 97,751 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,436 మందికి పాజిటివ్‌గా తేలింద‌ని వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డింది. తాజాగా మరో 14 మందిని మహమ్మారి బలి తీసుకుంది. మొత్తం మృతుల సంఖ్య 3,378కి పెరిగింది. కాగా, తెలంగాణలో రికవరీ రేటు 94.85 శాతానికి పెరిగింది.

దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,91,170కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,016 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో రికవరీ రేటు 94.85 శాతానికి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి 3,614 మంది కోలుకుని డిశ్చార్ అయ్యారు. కామారెడ్డి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story