Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జునసాగర్

Nagarjuna Sagar: 14 గేట్లు ఎత్తిన అధికారులు

Sandeep Eggoju
Updated on: 2 Aug 2021 9:02 AM IST
14  Nagarjuna Sagar Gates Lifted  Due to Water Inflow,
X

14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన నాగార్జున సాగర్ 

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 14 క్రస్టు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story