logo
తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

14 kgs of Drugs Seized in Hyderabad
X

హైదరాబాద్ లో పట్టుబడ్డ 14 కిలోల డ్రగ్స్

Highlights

Hyderabad: 14కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 14 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తరలిస్తున్నట్లు గుర్తించారు. బేగంపేట్ ఇంటర్‌నేషనల్ పార్శిల్ ఆఫీసులో డ్రగ్స్‌ను గుర్తించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 5.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు దాదాపు 3వందల కేజీల డ్రగ్స్ తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఫొటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Web Title14 kgs of Drugs Seized in Hyderabad
Next Story