తెలంగాణలో 2 లక్షలుదాటిన కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 5 Oct 2020 9:42 AM IST
తెలంగాణలో 2 లక్షలుదాటిన కరోనా కేసులు
X

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలు దాటేశాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,335 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,171కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,176 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,72,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,134 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 36,348 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 32,41,597 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story