గెలిచిన భార్యకు ముద్దులతో అభినందించిన భర్త!

గెలిచిన భార్యకు ముద్దులతో అభినందించిన భర్త!
x
Highlights

ఉత్కంఠభరితంగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కొన్నిచోట్ల భావోద్వేగ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న వారు సంబరాలు ప్రారంభించారు

ఉత్కంఠభరితంగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కొన్నిచోట్ల భావోద్వేగ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న వారు సంబరాలు ప్రారంభించారు. కొంతమంది విజయం సాధించి.. విజయోత్సవాలు చేసుకుంటున్నారు. 112వ డివిజన్ రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 3459 ఓట్లతో పుష్ప విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆమె సంబరాల్లో మునిగిపోయారు. ఆనందోత్సాహంతో ఆమె భర్త నగేశ్ యాదవ్ ముద్దు పెట్టి అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories