అక్క, బావ వేధింపులు.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి అంటూ కేసీఆర్, కేటీఆర్ లకు పదో తరగతి విద్యార్థి విజ్ఞప్తి

Nelakondapally: సొంత అక్క, బావ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.

Arun Chilukuri
Published on: 23 Jan 2022 8:23 PM IST
10th Class Student Letter to CM KCR and KTR
X

అక్క, బావ వేధింపులు.. కారుణ్య మరణానికి..

Nelakondapally: సొంత అక్క, బావ వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మా. నాన్న చనిపోయారు. నా ఆస్తులు, డబ్బులు కావాలని అక్క వేధిస్తోంది. వారి వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. నాకు చనిపోవాలని ఉంది..ప్లీజ్ నా కారుణ్య మరణానికి అనుమతించండి అంటూ మంత్రి కేటీఆర్, కేసీఆర్‌కు లేఖ రాశాడు ఓ బాలుడు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ దంపతులు అనారోగ్యంతో మరణించారు. వీరికి ఓ కూతురు ఉండగా ఆమెకు పెళ్లైంది. ఇక కుమారుడు సాయి 10వ తరగతి చదువుతున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తల్లి మరణించిన తర్వాత అమ్మ ఉద్యోగంతో పాటు డబ్బులు కావాలని తన అక్క, భావ వేధిస్తున్నారని బాలుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను బ్రతకలేనని తనకు ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదని అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story