తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

X
Highlights
తెలంగాణలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1058 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరుకుంది.
Krishna19 Nov 2020 3:52 AM GMT
తెలంగాణలో నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1058 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అటు కరోనాతో గడిచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,419కి చేరుకుంది. ఇక నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 1,440 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,46,733కి చేరుకుంది. దీనితో రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,682 గా ఉన్నాయి. ఇక ఇందులో 10,352 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి 8గంటల వరకు 38,757 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఆ సంఖ్య 50,11,164కి చేరుకుంది.
Web Title1058 corona cases registered in last 24 hours from Telangana
Next Story