Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 7:09 PM IST
1,028 New Coronavirus Cases Reported in Telangana 26th July
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఒక వెయ్యి 28 మందికి కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 19 వేలు దాటింది. కరోనాతో మరో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3 వేల 627 కి చేరినట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి కోలుకుని మరో 14 వందల 89 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 15 వేల 54 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసు మరణాల రేటు తెలంగాణలో 0.58శాతం ఉంటే.. దేశంలో 1.3శాతం ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story