Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 10,122 కరోనా కేసులు, 52 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది.

Arun Chilukuri
Updated on: 27 April 2021 11:33 AM IST
10,122 New Coronavirus Cases Reported in Telangana on 27 April 2021
X

కరోనా(ఫైల్ ఇమేజ్ )

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 10,122 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఒక్కరోజులో కరోనాతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 6,446 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల,11వేల, 905కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3లక్షల, 40వేల, 590 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2వేల,94గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 69వేల, 221 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 1,440 మందికి క‌రోనా సోకింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story