రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

10 per cent reservation for weaker sections: CM KCR
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర వర్ణాలకు 10శాతం EWS రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. EWS రిజర్వేషన్ల అమలుపై రెండ్రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఎప్పట్నుంచి ఎలా అమలు అమలు చేయాలో కార్యాచరణ రూపొందించనున్నారు. 10శాతం EWS రిజర్వేషన్ల అమలుతో తెలంగాణలో 60శాతానికి చేరనున్నాయి.

తెలంగాణలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్ ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ర్టంలో రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు యథావిధిగా కొనసాగిస్తూ ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బలహీన వర్గాలకు అమలు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్లతో పాటు ఇడబ్ల్యూఎస్ తో కలుపుకుని 60 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories