Top
logo

ఐటీలో హైదరాబాద్‌ నగరం బెంగళూరును దాటిపోయింది : కేటీఆర్

ఐటీలో హైదరాబాద్‌ నగరం బెంగళూరును దాటిపోయింది : కేటీఆర్
X
Highlights

ఈ సందర్భంగా ఐటీ రంగంపై కేటీఆర్‌ మాట్లాడారు...ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్‌బుక్‌, ఆపిల్‌, గూగుల్‌, అమెజాన్‌.. బెంగళూరు కాదని హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరం బెంగళూరును దాటిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తూన్నారు. ఈ సందర్భంగా ఐటీ రంగంపై కేటీఆర్‌ మాట్లాడారు...ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్‌బుక్‌, ఆపిల్‌, గూగుల్‌, అమెజాన్‌.. బెంగళూరు కాదని హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ నగరం బెంగళూరును దాటిపోయిందని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం కాబట్టే 17 శాతం వృద్ధిరేటు సాధ్యమైంది. ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడే కంటే ముందు ఐటీ రంగంలో 3 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు. 12 లక్షల 67 వేల ఉద్యోగాలు టీఎస్‌ఐపాస్‌ ద్వారా సృష్టించాం. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం. కాబట్టి ఉద్యోగ కల్పన సృష్టిస్తున్నాం. రాష్ట్రం యువతకు కేసీఆర్‌ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్‌ తేల్చిచెప్పిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story