కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌లో చేరలేదు ..!

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌లో చేరలేదు ..!
x
Highlights

రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ ఎల్పీ విలీనం జరిగిందన్నారు. సీఎల్పీ విలీనమైతే అనర్హత ఉండదని సీఎం తెలిపారు. కాంగ్రెస్ నుంచీ వచ్చి ఎవరూ టీఆర్ఎస్ లో చేరలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరతామంటే తాము అభ్యంతరం చెప్పామన్నారు.

కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వాళ్లు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్ ఎల్పీ విలీనం జరిగిందన్నారు. సీఎల్పీ విలీనమైతే అనర్హత ఉండదని చెప్పామని సీఎం తెలిపారు. కాంగ్రెస్ నుంచీ వచ్చి ఎవరూ టీఆర్ఎస్ లో చేరలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరతామంటే తాము అభ్యంతరం చెప్పామన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని పిటీషన్లు వేసిన చెల్లవన్నారు. రాజస్థాన్ లో బీఎస్పీని కాంగ్రెస్‎లో విలీనం చేసుకోలేదా అని నిలదీశారు. కేంద్రంలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీజేపీ, కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమసమయంలో టీఆర్‌ఎస్‌ను చీల్చిన కాంగ్రెస్‌కు ..ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత లేదని కేసీఆర్‌ అన్నారు. రాజ్యాంగబద్దంగానే టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనమయ్యిందన్నారు. రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. సాగునీటిపై కాంగ్రెస్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టులు కట్టాలంటున్నారని ఎద్దేవా చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories