logo
తెలంగాణ

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్నిప్రమాదం

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్నిప్రమాదం
X
Highlights

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మంటలను అదుపులోకి తీసుకురావడానికి...

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆరు పైరింజన్లు, 10 వాటర్ ట్యాంకర్లతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అప్రమత్తమయ్యారు..ప్రమాదంలో ఎలాంటి ప్రాణహని జరగలేదు... భారీగా అస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు...

పండగ సంతోషం తీరనే లేదు. ఆనందంతో పూజలు చేసిన కొద్ది గంటలకే తీరని నష్టం సంభవించింది... కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనిలోని రాందేవ్ హర్డు వేర్ ఎలక్ట్రిక్ హర్డువేర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటు జరిగింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యుట్ వల్ల మూడు అంతస్థుల వరకు వ్యాపించింది. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి.. మంటలు అదుపులోకి తీసుకురావడానికి పైరి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇక్కడ పెద్ద ప్రమాదమే తప్పింది.. రాందేవ్ షోరూం పక్కనే ఉన్న జోస్ అలుక్కాస్,తరుణి షోరూం, విజయ డయాగ్నోస్టిక్స్, పక్కనే రెసిడెన్షియల్ కుటుంబాలకు వ్యాపించకుండా పైర్ సిబ్బంది చాక చక్యంగా అదుపుచేశారు..

అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణహని జరగలేదు.కాంప్లెక్స్ల్ లో ఉన్న వాచ్ మెన్ కుటుంబాన్ని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని అగ్నిమాపక అధికారులు తెలిపారు...దీపావలి కావడం పూజ చేసిన తర్వాత దీపాల వల్ల జరిగిందా లేదంటే షార్ట్ సర్క్యుట్ వల్ల జరిగిందా అని విచారణ చేస్తున్నామన్నారు..హర్డ్ వేర్ షాపులో పేయింటింగ్ డబ్బాలు ఉండడం ,ప్లైవుడ్ వస్తువులు ఉండడం , టర్పైంటైల్ ప్రభావంతో మంటులు అదుపులోకి రావడానికి ఆలస్యమైందని తెలిపారు..

సరైన పైర్ సేప్టి లేకపోవడం వల్లే వరస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..అధికారులు అనుమతి ఇచ్చేటప్పుడే అన్ని ఉన్నాయా లేదా అని చేక్ చేయాల్సిన అవసరం ఉంది.. అధికారులు పర్యావేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి...

Next Story