Flipkart New Deals: ఫ్లిప్‌కార్ట్ గ్యారెంటీడ్ వాల్యూ ప్రోగ్రామ్‌.. ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు..!

Flipkart New Deals
x

Flipkart New Deals: ఫ్లిప్‌కార్ట్ గ్యారెంటీడ్ వాల్యూ ప్రోగ్రామ్‌.. ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు..!

Highlights

Flipkart New Deals: నథింగ్ ఫోన్ 3a సిరీస్ మార్చి 4న బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేశారు.ఈ సిరీస్‌లో రెండు మోడల్‌లు ఉన్నాయి.

Flipkart New Deals: నథింగ్ ఫోన్ 3a సిరీస్ మార్చి 4న బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేశారు.ఈ సిరీస్‌లో రెండు మోడల్‌లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3a ప్రో,నథింగ్ ఫోన్ 3a. ఈ ఫోన్ మొదటి సేల్ భారత్‌లో మార్చి 11 నుండి ప్రారంభం కానుంది. మీరు కూడా ఈ రెండు ఫోన్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ ఫోన్‌లను చౌకగా మీ సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ వాల్యూ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను నథింగ్ ఫోన్ 3a ప్రో లేదా ఫోన్ 3aకి ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ని చౌకగా కొనుగోలు చేయచ్చు. ఈ నథింగ్ ఫోన్ 3a మొదటి సేల్ సమయంలో అందుబాటులోకి రానుంది. గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ వాల్యూ ప్రోగ్రామ్‌ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వన్‌ప్లస్, సామ్‌సంగ్ నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు వర్తిస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్‌లో 2019లో లేదా ఆ తర్వాత విడుదల చేసిన iOS స్మార్ట్‌ఫోన్లను కూడా మార్చుకోగలరు. ఈ ఆఫర్ కొత్త నథింగ్ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ రోజున మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మార్చి 11 నుండి నథింగ్ ఫోన్ 3a సేల్‌కి అందుబాటులో ఉంటుంది, ఫోన్ 3a ప్రో మార్చి 15 నుండి సేల్‌కి వస్తుంది.

Nothing Phone 3a, Nothing Phone 3a Pro Price

నథింగ్ ఫోన్ 3a ధర 8GB + 128GB కాన్ఫిగరేషన్ రూ. 24,999 నుండి ప్రారంభమవుతుంది, అయితే 8GB + 256GB వేరియంట్ ధర రూ. 26,999. ఇవి మూడు కలర్స్‌లో విడుదల అయ్యాయి. అందులో బ్లాక్, బ్లూ, వైట్ ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 3a ప్రో ధర 8GB + 128GB రూ. 29,999 నుండి ప్రారంభమవుతుంది. ఫోన్ 256GB స్టోరేజ్ వేరియంట్ 8GB,12GB RAM ఎంపికలతో వస్తుంది, వీటి ధర వరుసగా రూ.31,999, రూ.33,999. ఫోన్ బ్లాక్, గ్రే కలర్స్‌లో వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories