Yahoo: ఇండియాలో వార్తా సేవలు నిలిపివేసిన యాహూ

* రెండు దశాబ్దాల కిందట యాహూ న్యూస్ ప్రారంభం * కొత్త నియంత్రణ చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం * కీలక నిర్ణయం తీసుకున్న యాహూ

Sandeep Reddy
Updated on: 26 Aug 2021 9:30 PM IST
Yahoo Discontinues News Services in India From Today 26 08 2021
X

యాహూ న్యూస్ (యాహు ఫోటో)

Yahoo: భారత్‌లో రెండు దశాబ్దాలకు పైగా ఇంటర్నెట్ సేవలందిస్తున్న యాహూ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాహూ న్యూస్‌ను నిలిపివేసింది. గూగుల్ రాకతో యాహూ కొంచెం వెనుకబడినా ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. ఇవాళ్టీ నుంచి యాహూ న్యూస్‌కు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూస్‌లో ఎలాంటి తాజా కంటెంట్ ను పోస్టు చేయలేదు. అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఐటీ దిగ్గజం వెల్లడించింది. తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగదని స్పష్టం చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story