Redmi Note 14 Pro 5G: రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కెమెరా ఫీచర్లు అదుర్స్..!

Redmi Note 14 Pro 5G: షియోమీ త్వరలో Redmi Note 14 Pro 5G ని లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen3పై ఆధారపడి ఉంటుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Aug 2024 1:12 PM IST
Redmi Note 14 Pro 5G
X

Redmi Note 14 Pro 5G

Redmi Note 14 Pro 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ త్వరలో Redmi Note 14 Pro 5G ని లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen3పై ఆధారపడి ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌ని ఉపయోగించిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా నోట్ 14 ప్రో 5జీ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో వచ్చిన స్ట్రాంగెస్ట్ ఫోన్ అవుతుంది. షియోమీ టైమ్ సభ్యులు దీని గురించి కొంత సమాచారాన్ని వెల్లడించారు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi Note 14 Pro 5G Features (రెడ్‌మీ నోట్ 14 ప్రో ఫీచర్స్)
ఈ సమాచారం HyperOS సోర్స్ కోడ్ నుండి తీసుకోబడింది. రెడ్‌మీ నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. నివేదిక ప్రకారం 7s Gen 3 20 శాతం ఎక్కువ GPUకి పవర్ సప్లై చేస్తుంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బెటర్‌గా ఉంటుంది.

రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీలో అద్భుతలమైన కెమెరా సెటప్ చూడొచ్చు. స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వెర్షన్ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని ద్వారా ఇమేజ్ క్వాలిటీ మిస్ అవకుండా వస్తువులను జూమ్ చేయవచ్చు. అయితే చైనాలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ టెలిఫోటో లెన్స్‌కి బదులుగా మాక్రో లెన్స్ కలిగి ఉంటుంది. చిన్న వస్తువులను దగ్గరగా ఫోటో తీయడానికి ఇష్టపడే వక్తులకు ఇది చాలా మంచి ఫీచర్.

రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ O16Uగా రిజిస్టర్ అయింది. ఇది రాబోయే రోజుల్లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. శక్తివంతమైన కొత్త ప్రాసెసర్, కెమెరా ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ టెక్ మార్కెట్‌లో బలమైన ఎంపికగా మారుతుంది. ప్రస్తుతం Xiaomi మరిన్ని వివరాలను నిర్ధారించడానికి ఇంకా సమయం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story