Xiaomi 14 Price Drop: డీల్ అదిరింది.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.10 వేలు డిస్కౌంట్..!

Xiaomi
x

Xiaomi 

Highlights

Xiaomi 14 Price Drop: షియోమి దీపావళి సేల్ ప్రకటించింది. రూ.10 వేల డిస్కౌంట్‌తో Xiaomi 14ని కొనుగోలు చేయవచ్చు.

Xiaomi 14 Price Drop: దీపావళికి ముందే టెక్ మేకర్ షియోమి వైబ్‌సైట్‌లో MI సేల్‌ను ప్రారంభించింది. సేల్‌లో షియోమి స్మార్ట్‌ఫోన్లపై బలమైన డీల్స్ అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో మీరు ఫోటోగ్రఫీ కోసం మంచి కెమెరా సెటప్ కావాలంటే Xiaomi 14 మొబైల్‌పై ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్+512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.59,999కి అందుబాటులో ఉంది. మీరు దీపావళి సేల్‌లో రూ.10 వేల ఫ్లాట్ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సేల్ విషయానికి వస్తే ఈ తగ్గింపు కోసం మీరు ICICI, HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఎంపిక చేసిన పరికరాలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కంపెనీ రూ. 8,000 వరకు అదనపు తగ్గింపును కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

Xiaomi 14 Features
కంపెనీ ఈ ఫోన్‌లో 1200x2670 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.36 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కూడా అందిస్తోంది. ఫోన్ 12 GB RAM LPDDR5 RAM, 512 GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా మీరు ఫోన్‌లో Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ని చూస్తారు.

ఫోటోగ్రఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను పొందుతారు. ఇవి 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 4610mAh. ఈ బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories