WhatsApp Tips: వాట్సాప్ అద్భుత ట్రిక్.. డిలీట్‌ చేసిన ఫొటోలు, వీడియోలని మళ్లీ చూడవచ్చు..!

WhatsApp is a Wonderful Trick Deleted Photos and Videos can be Seen Again
x

WhatsApp Tips: వాట్సాప్ అద్భుత ట్రిక్.. డిలీట్‌ చేసిన ఫొటోలు, వీడియోలని మళ్లీ చూడవచ్చు..!

Highlights

Whatsapp Tips: ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వచ్చినప్పటి నుంచి అన్ని పనులు అర నిమిషంలో జరుగుతున్నాయి.

Whatsapp Tips: ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వచ్చినప్పటి నుంచి అన్ని పనులు అర నిమిషంలో జరుగుతున్నాయి. మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా సమాచారం వెంట వెంటనే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వాట్సాప్ గురించి. కోట్లాది మంది వాట్సాప్‌లోనే ఎక్కు సమయం గడుపుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కి పేరు ఉంది. ఈ యాప్‌లో మెస్సేజ్‌లు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు, అనేక మీడియా ఫైల్‌లు షేర్ చేయవచ్చు. అయితే కొన్నిసార్లు ఇవి అనుకోకుండా డిలీట్‌ అవుతాయి. ఇలాంటి సమయంలో చిన్న ట్రిక్‌ ఉపయోగించి వీటిని మళ్లీ చూడవచ్చు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఫోన్ గ్యాలరీ

వాట్సాప్‌ అన్ని చిత్రాలు, వీడియోలు Android, iPhone రెండింటి ఫోన్ గ్యాలరీలో డిఫాల్ట్‌గా సేవ్ అవుతాయి. అందువల్ల వాట్సాప్‌ నుంచి మీడియా ఫైల్‌లు డిలీట్‌ అయినా వాటిని ఫోన్ గ్యాలరీలో చూడవచ్చు.

ఫైల్ ఎక్స్‌ప్లోరర్

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని వాట్సాప్ ఫోల్డర్‌కు వెళ్లడం వల్ల మీడియా ఫైల్‌ల నుంచి డిలీట్‌ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు.

వాట్సాప్‌ బ్యాకప్

మీరు వాట్సాప్ చాట్‌లు, మీడియాను రోజువారీ లేదా వారం వారం లేదా, నెలవారీ గూగుల్‌ డిస్క్ లేదా iCloudకి బ్యాకప్ చేయవచ్చు. ఒకవేళ చాట్‌లు, మీడియా ఫైల్‌లు డిలీట్‌ చేస్తే వాట్సాప్‌ను తొలగించి మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి. అప్పుడు వాట్సాప్ లాగిన్ సమయంలో రికవరీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం వల్ల ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు.

WAMR యాప్‌

ఈ రోజుల్లో ప్రజలు మెసేజ్‌లు పంపి వాటిని వెంటనే డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని కూడా తిరిగి పొందవచ్చు. ప్లే స్టోర్ నుంచి WAMR అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని సహాయంతో డిలీట్‌ చేసిన ఫోటోలు, వీడియోలను మాత్రమే కాకుండా చాట్‌లను కూడా పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories