WhatsApp: వాట్సాప్‎లో సరికొత్త ఫీచర్..

WhatsApp Brings new Updates
x

WhatsApp: వాట్సాప్‎లో సరికొత్త ఫీచర్..

Highlights

WhatsApp: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‎ను ప్రవేశపెట్టింది.

WhatsApp: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్‎ను ప్రవేశపెట్టింది. వాట్సాప్‎లో ఒకరికి మెస్సేజ్ పంపిన తర్వాత, సాధారణంగా గంటవరకు దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆ ఆప్షన్‎ను మరింత డెవలప్ చేశారు. ఇకపై పంపిన మెసేజ్ ను రెండు రోజుల వరకు తొలగించుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. దీంతోపాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు లభించనున్నాయి. గ్రూపులోని ప్రతి ఒక్కరి ఫోన్లో మెస్సేజ్‎లు డిలీట్ అయ్యే ఆప్షన్ అడ్మిన్లకు ఉంటుంది. ఫేక్ సమాచారం ఎక్కువగా వ్యాప్తి అవుతున్న దృష్ట్యా అడ్మిన్లకు ఈ అధికారాలు సమకూర్చాలని వాట్సాప్ నిర్ణయించింది. అయితే ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories