Vivo Y78 5G: 64 మెగా పిక్సెల్ కెమెరా.. 16 జీబీ ర్యామ్.. వీవో నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Vivo తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉంది. Vivo తాజాగా Y78 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Arun Chilukuri
Updated on: 31 May 2023 8:00 PM IST
Vivo Y78 5G: 64 మెగా పిక్సెల్ కెమెరా.. 16 జీబీ ర్యామ్.. వీవో నుంచి  అదిరిపోయే 5G ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
X

Vivo తన కస్టమర్ల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉంది. Vivo తాజాగా Y78 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. Vivo Y78 5G ఫీచర్లు, ధర గురించి మరింత తెలుసుకుందాం..

Vivo Y78 5G ఫీచర్లు..

Vivo Y78 5G ఫోన్ వినియోగదారులకు 6.78-అంగుళాల కర్వ్డ్ ఎడ్జ్ OLED డిస్‌ప్లేను అందిస్తుంది. దీని రిజల్యూషన్ ఫుల్ HD ప్లస్, రిఫ్రెష్ రేట్ 120 Hz. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్టోరేజ్ గురించి చెప్పాలంటే, ఇది 8 GB RAM, 8 GB వర్చువల్ ర్యామ్‌ని కలిగి ఉంది.

ఇది 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఈ స్టోరేజ్‌ని విస్తరించుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే, ఇది 5,000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 44 W ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతుంది. ఫోన్ Android 13 ఆధారిత FunTouch OS 13 పై రన్ అవుతుంది.

కెమెరా గురించి మాట్లాడితే, ఈ Vivo ఫోన్‌లో OIS మద్దతుతో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని కలిగి ఉంది.

Vivo Y78 5G ధర..

Vivo Y78 5G ఫోన్ డ్రీమీ గోల్డ్, ఫ్లేర్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.ఈ ఫోన్ ప్రస్తుతం సింగపూర్‌లో లాంచ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో ఈ ఫోన్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చైనాలో ఈ Vivo ఫోన్ ధర 8/256GB వేరియంట్‌కు సుమారు CNY 1,699 (సుమారు రూ. 20,100), 12/256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,700)గా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story