Vivo Y300 GT Launched: 7,620mAh బ్యాటరీ.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?


Vivo Y300 GT Launched: 7,620mAh బ్యాటరీ.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?
Vivo Y300 GT Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన స్వదేశంలో తన సరికొత్త Vivo Y300 GT స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
Vivo Y300 GT Launched: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన స్వదేశంలో తన సరికొత్త Vivo Y300 GT స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 12జీబీ ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. అయితే, ఈ Vivo Y300 GT స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ప్రస్తుతం ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదు.
Vivo Y300 GT Price
చైనాలో విడుదలైన Vivo Y300 GT ప్రారంభ 8GB + 256GB వేరియంట్ CNY 1,899 (సుమారు రూ. 22,400) నుండి ప్రారంభమవుతుంది. కానీ 12GB + 256GB , 12GB + 512GB కాన్ఫిగరేషన్‌ల ధర వరుసగా CNY 2,099 (దాదాపు రూ. 24,400), CNY 2,399 (దాదాపు రూ. 28,400) గా ఉంది.
Vivo Y300 GT Features
Vivo Y300 GT స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K (1,260×2,800 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 5,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్, SGS టెక్నాలజీ తక్కువ బ్లూ లైట్, తక్కువ ఫ్లికర్ సర్టిఫికేషన్‌లతో HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ చైనాలో అధికారిక ఈ-స్టోర్, ఎంపిక చేసిన ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం బ్లాక్, డెసర్ట్ గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌తో 12GB వరకు ర్యామ్, 512GB వరకు UFS3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఉంటుంది.
ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5 స్కిన్‌తో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,620mAh బ్యాటరీని ఉంది. ఇది బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ అందించారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire