Vivo T4 Ultra Launch Soon: ఇది మాత్రం కేక.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ తెలిసిపోయాయ్..!

Vivo T4 Ultra Launch Soon Expected Features and Specifications
x

Vivo T4 Ultra Launch Soon: ఇది మాత్రం కేక.. వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ తెలిసిపోయాయ్..!

Highlights

Vivo T4 Ultra Launch Soon: వివో T4 స్మార్ట్‌ఫోన్‌ను మిడ్-రేంజ్ విభాగంలో కొద్ది రోజుల క్రితం లాంచ్ చేశారు.

Vivo T4 Ultra Launch Soon: వివో T4 స్మార్ట్‌ఫోన్‌ను మిడ్-రేంజ్ విభాగంలో కొద్ది రోజుల క్రితం లాంచ్ చేశారు. ఇప్పుడు కంపెనీ మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వివో T4 అల్ట్రాను విడుదల చేయాలని యోచిస్తోంది. అంతకుముందు, వివో గత సంవత్సరం వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ప్రస్తుతం దీని ధర రూ.27,999. ఇప్పుడు కంపెనీ దానిని భర్తీ చేయాలని యోచిస్తోంది. లాంచ్ కు ముందు, వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి కొత్త సమాచారం వెల్లడైంది. వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ జూన్ ప్రారంభంలో లాంచ్ కావచ్చని చెబుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo T4 Ultra Specifications

వివో T4 అల్ట్రా స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లే ప్యానెల్‌ ఉంటుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 సిరీస్ చిప్‌సెట్‌తో మార్కెట్లోకి వస్తుంది.

కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను 50-మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్‌తో చూడవచ్చు. మెయిన్ కెమెరాతో పాటు, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. గతంలో, T3 అల్ట్రాలో 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందించారు.

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. రాబోయే వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15పై రన్ అవుతుంది. ప్రస్తుతం, ఈ ఫోన్ బ్యాటరీ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో మార్కెట్లోకి వస్తుందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

Vivo T3 Ultra Specifications And Price

వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ SoCప్రాసెసర్ ఉంటుంది. దీనికి 50-మెగాపిక్సెల్ (OIS) ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ వివో ఫోన్ 5500mAh బ్యాటరీతో వస్తుంది, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ వివో ఫోన్ బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.27,999. దీనితో పాటు, రెండవ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్‌తో రూ. 31,999 ధరకు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories