Vivo X90 Pro: అద్భుతమైన ఫొటో తీస్తే చాలు.. రూ. 5 లక్షలతోపాటు Vivo X90 Pro ఫోన్ గెలుచుకునే ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Vivo Smartphone Photography Awards Win RS 5 Lakh and Vivo X90 Pro
x

Vivo X90 Pro: అద్భుతమైన ఫొటో తీస్తే చాలు.. రూ. 5 లక్షలతోపాటు Vivo X90 Pro ఫోన్ గెలుచుకునే ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Highlights

Vivo Photography Contest: మీరు అద్భుతమైన ఫోటోలు తీస్తారా.. Vivo మీకు రూ. 5 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. డబ్బు మాత్రమే కాదు, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ మీకు కల్పిస్తోంది.

Vivo Photography Contest: మీరు అద్భుతమైన ఫోటోలు తీస్తారా.. Vivo మీకు రూ. 5 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. డబ్బు మాత్రమే కాదు, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కంపెనీ మీకు కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ప్రత్యేక అవార్డును ప్రకటించింది. వివో ఇమాజిన్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ అవార్డులను కంపెనీ ప్రవేశపెట్టింది.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కలిసి కంపెనీ ఈ పోటీని నిర్వహిస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ పోటీ ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు Vivo పరికరాల సహాయంతో వారి సృజనాత్మకతను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తుంది.

రూ. 5 లక్షలు గెలుచుకోవచ్చు..

ఈ పోటీలో 6 కేటగిరీలు ఉన్నాయి – ప్రకృతి, పోర్ట్రెయిట్, నైట్, మోషన్, ఆర్కిటెక్చర్, కల్చర్. షార్ట్‌లిస్ట్ చేయబడిన పోటీదారులు ఫోటోగ్రాఫర్‌లు వినీత్ వోహ్రా, రాకేష్ పులపా, అమీర్ వానీల మాస్టర్ క్లాస్‌లలో పాల్గొనే అవకాశం పొందుతారు.

ఇది మాత్రమే కాదు, ఈ పోటీలో గెలుపొందినందుకు, కంపెనీ రూ. 5 లక్షల బహుమతిని, Vivo X90 Pro స్మార్ట్‌ఫోన్, వీడియోగ్రాఫర్ టైటిల్‌ను అందిస్తోంది . వారి పని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, వివో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించబడుతుందని Vivo తెలిపింది.

ఎలా పాల్గొనగలరు?

మొత్తం 6 కేటగిరీల విజేతలకు కంపెనీ రూ. 5 లక్షలు, X90 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అందజేస్తుంది. మీరు ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే, మీరు www.vivoimagine.comకి వెళ్లాలి. ఇది ఆగస్టు 25 నుంచి ప్రారంభమైంది. ఇచ్చిన వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు పోటీ కోసం మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవచ్చు.

వినియోగదారులు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి వారి ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. దీని తర్వాత మీరు మీ ఫోటోగ్రఫీ వర్గం, ఆసక్తి, చివరిగా మీ ఫోటోలను అప్‌లోడ్ చేయాలి.

ఈ అవార్డు గురించి వివో ఇండియా కార్పొరేట్ స్ట్రాటజీ హెడ్ గీతాజ్ చన్నాన మాట్లాడుతూ, 'మేం వివో ఫోటోగ్రఫీ అవార్డులను ప్రకటించాం. ఔత్సాహికులు తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు వేదికను కల్పిస్తున్నాం. ఈ అవార్డు మా బ్రాండ్‌ను పునర్నిర్వచించడమే కాకుండా, స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో కొత్త ఓరవడిని తెస్తుంది' అంటు చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories