Sale: ఆఫర్ల విషయంలో తగ్గేదేలే.. విజయ్‌ సేల్స్‌లో 70 శాతం వరకు డిస్కౌంట్‌..!

Independence Day Sale: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని అన్ని ఈ కామర్స్‌ సంస్థలు భారీగా డిస్కౌంట్‌లు అందిస్తోన్న విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Aug 2024 12:33 PM IST
Vijay Sales Offering Huge Discounts in Mega Freedom Sale 2024
X

Sale: ఆఫర్ల విషయంలో తగ్గేదేలే.. విజయ్‌ సేల్స్‌లో 70 శాతం వరకు డిస్కౌంట్‌..!

Independence Day Sale: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని అన్ని ఈ కామర్స్‌ సంస్థలు భారీగా డిస్కౌంట్‌లు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా దాదాపు అన్ని ఈ కామర్స్‌ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము కూడా తక్కువేం కాదన్నట్లు విజయ్‌ సేల్స్‌ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. ఆగస్టు 6వ తేదీన మొదలైన ఈ సేల్ ఆగస్టు 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా ఏయే ప్రొడక్ట్స్‌పై ఎలాంటి డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్‌పై విజయ్‌ సేల్స్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 79,600కాగా సేల్‌లో భాగంగా రూ. 65,690కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌ను 67,590 రూపాయల తగ్గింపు ధరతో సేల్‌లో సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఐసీఐసీ, ఎస్‌బీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్ఈ ఈ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఎల్జీ వాషింగ్‌ మిషిన్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఎల్సీ 7.5 కేజీల ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్ మిషన్‌ ధర రూ. 19,490గా నిర్ణయించారు. ఇక సెమీ ఆటోమేటిక్‌ వాషింగ్ మెషిన్‌ ధర రూ. 7990 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఇక విజయ్‌ సేల్స్‌లో భాగంగా సౌండ్‌బార్స్‌, ప్లే స్టేషన్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వీటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ల్యాప్‌టాప్‌ లవిషయానికొస్తే రూ. 29,999 నుంచి ధరలు ప్రారంభమవుతున్నాయి. సేల్‌లో భాగంగా పలు బ్యాంకు ఆఫర్లు అందిస్తున్నారు. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో రూ. 20,000 లేదా అంత కంటే ఎక్కువ కొనుగోలు చేసే రూ. 3000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

అలాగే హెడ్‌ఎఫ్‌సీ బ్యాంకు యూజర్లు రూ. 50,000 కార్డ్ లావాదేవీలపై రూ. 4,500 వరకు తగ్గింపు పొందొచ్చు. యస్‌ బ్యాంక్‌కు చెందిన వన్‌ కార్డ్‌, అమెక్స్‌ కార్డుదారులకు కూడా ఆఫర్లు అందిస్తున్నారు. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌ రూ. 20,000 ఈఎమ్‌ఐ లావాదేవీలపై రూ. 5,000 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ అవకాశం కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story