iPhone 15 Series Discount: మళ్లీ ఆఫర్లు వచ్చాయ్.. ఈ సారి ఊహించని డిస్కౌంట్లు.. ఐఫోన్ కొనేయండి!

iPhone 15 Series Discount: విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు ఐఫోన్ 15, 15 ప్లస్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Dhatripriya
Updated on: 5 Aug 2024 10:27 PM IST
iPhone 15 series
X

iPhone 15 series

iPhone 15 Series Discount: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్లను ఎవరూ బీట్ చేయలేరనే చెప్పాలి. వాటికి ఉన్నా క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యువత ఐఫోన్ అంటే పడిసచ్చిపోతారు. ఈ క్రమంలోనే ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ నిరంతరం డీల్స్‌ను ప్రకటిస్తుంటాయి. తక్కువ ధరకే ఫోన్లను అందిస్తుంటాయి. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ సేల్స్ ఐఫోన్ 15 సిరీస్‌పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. అలానే కొన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై తగ్గింపులను అందిస్తుంది. ఐఫోన్ లవర్స్ ఇప్పుడు తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 15 Offers
విజయ్ సేల్స్ ఐఫోన్ 15పై అందుబాటులో ఉన్న ఆఫర్ విషయానికి వస్తే 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌‌‌ను రూ.69,690కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని అసలు ధర రూ. . 79,900గా ఉంది. అంటే ఇప్పుడు రూ.10,210 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4,000 డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో ఫైనల్‌గా రూ.65,690కి ఫోన్‌ను దక్కించుకోవచ్చు.

iPhone 15 Plus Offer
ఐఫోన్ 15 ప్లస్ విజయ్ సేల్స్‌లో రూ.77,190 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ. 89,900కి ఆపిల్ విడుదల చేసింది. అంటే ఫోన్‌పై రూ. 12,710 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఫోన్ల ధరలో రూ.7,500 వ్యత్యాసం ఉంది . మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్, పెద్ద స్క్రీన్ కావాలంటే మీరు ప్లస్ మోడల్‌ని కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు ప్లస్ మోడల్ కెమెరా బేస్ మోడల్ కంటే బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది.

ఆపిల్ తన నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ సిరీస్.. ఐఫోన్ 16 ఈ సంవత్సరం చివరలో సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఐఫోన్ 16 లైనప్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లు ఉండనున్నాయి. iPhone 16 సిరీస్ డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఈ ఏడాది జూన్‌లో ప్రకటించిన iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఆపిల్ ఇండియాలో తయారు చేస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story