మీ ఫోనే ఇక మీ ఆధార్ కార్డు.. ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ లాక్ వంటి 10కి పైగా కొత్త ఫీచర్లతో UIDAI కొత్త యాప్!

UIDAI Launches New Aadhaar App 2026: దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక అడుగు వేసింది.
UIDAI Launches New Aadhaar App 2026: దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక అడుగు వేసింది. పాత వెర్షన్ల కంటే అత్యంత వేగంగా, సురక్షితంగా పనిచేసే సరికొత్త ఆధార్ యాప్‌ను (New Aadhaar App) జనవరి 28, 2026న అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా భౌతిక ఆధార్ కార్డుతో పనిలేకుండా స్మార్ట్‌ఫోన్ ద్వారానే అన్ని సేవలను పొందవచ్చు.
యాప్ సెటప్ చేసుకునే విధానం (Step-by-Step Guide):
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి 'Aadhaar App' సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
యాప్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరా, SMS, కాల్స్ మరియు నోటిఫికేషన్లకు అనుమతి (Permission) ఇవ్వాలి.
మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని యాప్ ఆటోమేటిక్‌గా రీడ్ చేస్తుంది.
ఫేస్ అథెంటికేషన్: ఇది కొత్త ఫీచర్. మంచి వెలుతురు ఉన్న చోట నిలబడి, కళ్లద్దాలు లేకుండా సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించుకోవాలి.
పిన్ సెట్ అప్: యాప్ భద్రత కోసం 6 అంకెల పిన్ (App PIN)ను సెట్ చేసుకోవాలి. దీంతో మీ ఆధార్ ప్రొఫైల్ జనరేట్ అవుతుంది.
కొత్త యాప్‌లో అద్భుతమైన ఫీచర్లు:
ఫ్యామిలీ ప్రొఫైల్: ఒక్క యాప్‌లో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను యాడ్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ లాక్: మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ వాడకుండా యాప్ నుండే లాక్/అన్‌లాక్ చేయవచ్చు.
సెలెక్టివ్ షేరింగ్: ఆధార్‌లోని పూర్తి సమాచారం కాకుండా, అవసరమైన వివరాలను మాత్రమే ఇతరులకు షేర్ చేసే వెసులుబాటు ఉంది.
డౌన్లోడ్ & అప్డేట్: మాస్క్డ్ (Masked) ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్, మొబైల్ నంబర్ వంటివి యాప్ నుండే అప్డేట్ చేసుకోవచ్చు.
బహుభాషా సౌకర్యం: తెలుగు, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 14 భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ఇకపై మీరు ఎక్కడికి వెళ్లినా ఫిజికల్ ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కొత్త యాప్‌లోని డిజిటల్ ఆధార్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాలకు ప్రామాణికంగా పనిచేస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



