Twitter Logo Changed: మారిన ట్విట్టర్ లోగో.. పిట్ట స్థానంలో కుక్కను తెచ్చిన ఎలాన్ మస్క్‌..

Twitter Logo Changed Blue Bird With Infamous Doge Meme
x

Twitter Logo Changed: మారిన ట్విట్టర్ లోగో.. పిట్ట స్థానంలో కుక్కను తెచ్చిన ఎలాన్ మస్క్‌..

Highlights

Twitter Logo Changed: పిట్ట కాస్తా కుక్కగా మారింది.. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మొత్తం దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు.

Twitter Logo Changed: పిట్ట కాస్తా కుక్కగా మారింది.. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మొత్తం దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. పిట్టేమిటి? కుక్కేమిటో అర్థం కాలేదు కదూ.. ఒక్కసారి మీరు ట్విట్టర్‌లోగోను చూడండి.. ఇప్పటి వరకు టిట్టర్‌ లోగోలో నీలి రంగులో ఎగురుతున్న పిట్ట బొమ్మ ఉండేది. ఇప్పుడు ఈ లోగో మారింది. అది కాస్తా కుక్క అయ్యింది. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నారని ప్రకటించిన నాటి నుంచి ఈ సైట్‌ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బ్లూ టిక్‌ వివాదం... కొనసాగుతుండగానే.. ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్‌ గురించి నిత్యం ఏదో ఒక పోల్‌ నిర్వహించే ఎలాన్‌ మస్క్‌.. సైలెంట్‌గా ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ లోగోను మార్చేశారు. ఎగురుతున్న పిట్టతో ఉపయోగం లేదని మస్క్‌ భావించారేమో.. దాన్ని తరిమేసి... సంస్థ కాపలాగా కుక్కను పెట్టుకున్నారు. ఇకపై ఈ డోజీ మీమే కొత్త లోగో అని ఎలాన్‌ మస్క్‌ ఓ ట్వీట్‌ కూడా చేశారు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకే ఈ లోగో మార్పును చేపట్టినట్టు ఎలాన్‌ మస్క్‌ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.

2022 మార్చి 26న ఓ ట్విట్టర్‌ యూజర్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా మస్క్‌ పంచుకున్నారు. అందులో సదరు యూజర్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి.. డోజీని లోగోగా పెట్టాలని సూచించారు. అప్పట్లో దానికి టెస్లా సీఈవో సానుకూలంగా స్పందించారు. తాజాగా ఆ సంభాషణను గుర్తు చేస్తూ... ఇచ్చిన మాట ప్రకారం.. లోగోను మార్పు చేసినట్టు ట్విట్టర్‌ అధినేత పేర్కొన్నారు. ఈ కొత్త లోగో శాశ్వతంగా ఉంటుందా? లేక కొన్నాళ్లకు తొలగిస్తారా? అనే విషయంపై మాత్రం ప్రపంచ కుబేరుడు స్పష్టత నివ్వలేదు. అయితే ఈ లోగో కేవలం ట్విట్టర్ డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో మాత్రమే మారింది. మైబైల్‌, యాప్‌లో మాత్రం ఇంకా బ్లూ బర్డే కొనసాగడం విశేషం. ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన నాటి నుంచి ఎలాన్‌ మస్క్‌ విచిత్రమైన ప్రకటనలు చేశారు. తరువాత.. ఆ సంస్థను టేకోవర్‌ చేసిన తరువాత.. పలు మార్కులకు శ్రీకారం చుట్టారు.

తాజా ట్విట్టర్‌ లోగోలో ఉన్న కుక్క.. క్రిప్టో కరెన్సీ అయిన.. డోజీకాయిన్‌కు సంబంధించిన డోజీ మీమ్‌.. నిజానికి ఈ కుక్క పిల్ల షిబా ఇనూ అనే జపాన్‌ జాతి శునకం. 2103లో తొలిసారి డోజీకాయిన్ క్రిప్టోకరెన్సీకి, దానిక వెనుక ఉండే బ్లాక్‌ చైన్‌ సాంకేతికతకు సదదాగా ఈ కుక్క చిత్రాన్ని లోగోగా క్రియేట్‌ చేసి పెట్టింది. నాటి నుంచి ఈ కుక్క బొమ్మను డోజీగానే పిలుస్తున్నారు. ఇక క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్‌కు ఎలాన్‌ మస్క్‌ ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు. గతంలో ఈ క్రిప్టోకరెన్సీని ట్విట్టర్‌లోనూ మస్క్‌ ప్రమోట్‌ కూడా చేశారు. తాజాగా ట్విట్టర్‌ లోగో పిట్టను తొలగించి.. డోజీని పెట్టడంతో.. డోజీకాయిన్ విలువ కూడా ఒక్కసారిగా పెరిగింది. 24 గంటల్లో ఈ క్రిప్టోకరెన్సీ విలువ ఏకంగా 22 శాతం పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories